సున్నితమైన వాటినే ముట్టుకోవాలనిపిస్తుంది
ముళ్లు గుచ్చుకుంటాయని తెలిసీ గులాబి రెమ్మను,
ముడుచుకుంటుందని తెలిసీ అత్తిపత్తి ఆకును,
వేళ్లు కాలుతాయని తెలిసీ మంటను తాకాలనిపిస్తుంది
ఒకానొక సారి ఒక దుమ్ము రేగే తిరుణాల సందడిలో
గోల గోలగా నడిచిపోయే జన సమూహాల మధ్య
రంగు రంగుల ఎద్దుల బొడ్డార్లు తాళ్లు తలుగుల మధ్య
ఎండకు నీడనిచ్చే తన కళ్ల కాంతిని ముట్టుకున్నాను
స్పర్శ తీరదనిపించే కోరికయ్యింది, విరహమయ్యింది,
సాఫల్యమయింది, ఓదార్పయ్యింది, అహరహమయ్యింది
తను అప్పుడప్పుడు వేళ్లు కాలే జ్వాల అవుతుంది, తాకితే
ముడుచుకునే అత్తపత్తి, ముళ్లున్న గులాబీ రెమ్మ
ఏం చేయను? ఏమీ చేయలేను! నేనామెను ప్రేమిస్తున్నాను
15-3-2010
2 comments:
gud one... sir
yenduko yemo bhale undi.
Post a Comment