ఎవరో రావాలని ఉంటుంది
ఎక్కడికో వెళ్లాలని ఉంటుంది
వేణుగానం పువ్వులు పరుస్తూ ఉంటుంది
పూలవనం రంగులు చల్లుతూ ఉంటుంది
శుభ్రమైన వాగు గలగల పారుతుంటుంది
ఒక చల్లని కడవ అలల్లోనికి తుమ్మెదలా వాలుతుంటుంది
రెండు నల్లని చేతులు దానికి రెక్కలయి కదులుతుంటాయి
కొబ్బరిచెట్టు చేతులు వళ్లో పెట్టుకుని యోగా చేస్తుంటుంది
చల్లని వెచ్చని తియ్యని పుల్లని నీరెండ పిలుస్తూ ఉంటుంది
ఉదయం నన్నొక నారింజ పండును చేసి
ఒక్కొక్క తొనను వలిచి నాకు ఇస్తూ ఉంటుంది
హృదయ లోలకం ఉయ్యాలలో పాపాయిలా
నవ్వు రెప్పలు మూస్తూ తెరుస్తూ ఉంటుంది
ఎవరో రావాలని ఉంటుంది
ఎక్కడికో వెళ్లాలని ఉంటుంది
వచ్చినట్టే వెళ్లినట్టే ఉంటుంది
8AM, 30-12-2011
6 comments:
nice
హెచ్చార్కె గారూ,
చాలా బాగుంది కవిత. వచ్చినట్టే ఉంటుంది.. వెళ్ళినట్టే ఉంటుందనడం బాధకు పరాకాష్ఠ. రాలేదు.. వెళ్ళలేదు వద్దే ఆగితే కొంత ఫర్వాలేదు..వెళ్ళినట్లు, వచ్చినట్లయిపోవడం ఇమ్యూనైపోవడమే కదా!
haayiga vundi
nice:)
బాగుంది కవిత..
బాగుందండీ కవిత!
Post a Comment