Sunday, January 1, 2012

దీపం


ఏమిటా వెలుగు, ఎందుకు నన్ను భయపెడుతున్నది
మండుతున్న చూపుడు వేలై బెదిరిస్తున్నది, ఈ రాత్రి

ఒంటరి దీపం పిలుస్తోంది పాడుతోంది నా కోసం
రహస్య బాధా సంకేతాలు వినా మాటల్లేని పాట

అదొక కన్నీటి చుక్క అనుకుంటా
బాల్కనీ నుంచి పడిపోతున్నది
కొడవలి కదిలిన మెరుపనుకుంటా
దిగులు పొలం కోస్తున్నారెవరో

ప్రేమ?

చీకటిని చాటు చేసుకుని దూకే కన్నీటి చుక్కలను
ఎవరూ వినరని నాకు మాత్రమే వినిపించే గాథలను
కోయడానికి దిగులు తప్ప ఏమీ లేని పొలాలను  
భయం సంకెళ్లు చుట్టిన పదాల పసి పాదాలను
ప్రేమిస్తూనే వున్నాను

కాని, ఏమిటా వెలుగు?

1 comments:

DESARAJU said...

‘దిగులు పొలాన్ని కోస్తున్నారెవరో’- చాలా బావుంది