తెలీ లేదు తెలివిడిలో జన్మించలేదు
పుట్టినప్పుడు అన్నీ అరుపులే ఒక్క అక్షరమూ లేదు
ఎదురైన ప్రతిదీ ఆశ్చర్యమే ప్రతి పద్యం ప్రతి పదం
మీ ఇంటికీ వచ్చాను సరిగ్గా అడగలేదన్నావు
ఇంకా ఇంట్లో అందరూ తినలేదన్నావు, చూడు
నీ ముంగిట్లో మట్టి కొంచెం తడిసి ఉంటుంది
అరికాళ్ల చెమ్మతోనో నేత్ర పాత్ర కొంచెం ఒలకడం వల్లనో
ఇది పాతది ఇది నవీనమని అనలేను
ఎద్దడి ప్రాంతం వాడిని చుక్క నీరూ గొప్పదే
వీణ అంటే ఏముంది, కొన్ని ఏక్‍తారల ఐక్యత, కాదా?
కలయికలో మొలకెత్తే అనురాగం, కాదా?
నేను వస్తూనే ఉంటాను ప్రేమిస్తూనే ఉంటాను
భిక్షుకుడిగానైనా
3PM, 24-1-2012
3 comments:
good
a bit different from your end sir
Nice one..
Post a Comment